నేటి నుంచి పది పరీక్షలు


Sat,March 16, 2019 12:42 AM

నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ: పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్ణీత తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాల్లో తాగునీరు,మరుగుదొడ్లు, డెస్క్‌లు, ఫ్యాన్లు తదితర ఏర్పాట్లను అధికారులను పరిశీలించారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 217 పాఠశాలల నుంచి 9,707 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
జిల్లా వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు.

జిల్లా వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు ప్రైవేటు ,44 ప్రభుత్వ పాఠశాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 217 పాఠశాలలు ఉండగా ఇందులో 140 ప్రభుత్వ, 77 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుండి మొత్తం 9,707 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.ఇందులో ప్రభుత్వ పాఠశాలల నుంచి 6,571మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 3136 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరితో పాటు 647 ప్రైవేటు విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

ప్రత్యేక బృందాలతో తనిఖీలు...
మాస్ కాపీయింగ్ నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఉండగా, ప్రతీ బృందంలో ఇద్దరు అధికారులు ఉంటారు. 519 మంది ఇన్విజిలేటర్‌లు, 46 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు,46 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు.

గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే సెంటర్ వద్దకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యులేటర్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని తెలిపారు. కేంద్రాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైతే సేవలు అందించేందుకు ఆరోగ్య సిబ్బందిని నియమించారు.

పకడ్బందీగా నిర్వహిస్తాం
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహి స్తాం. జిల్లా వ్యాప్తం గా 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. మాస్‌కాపీయింగ్ నిరోధానికి రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. 46 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసేందుకు నియమించాం. మాస్‌కాపీయింగ్ జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం.
-ప్రణీత, డీఈవో

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...