పకడ్బందీగా లోక్‌సభ ఎన్నికలు


Sat,March 16, 2019 12:42 AM

భైంసా, నమస్తే తెలంగాణ : లోక్‌సభ ఎన్నికలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జేసీ భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సరస్వతీ జూనియర్ కళాశాలలో పీవో, ఏపీవోలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని లోక్‌సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పారదర్శకంగా పోలింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌లు, ఎం-3 ఉండ గా.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఎం-2 రకమైన యంత్రాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పొరపాట్లు జరుగకుండా ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 గంటల వరకే ఈవీఎం, వీవీప్యాట్‌లను అందుబాటులో ఉంచాలని, పో లింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను ఎలా భద్రపరచాలో వివరించారు. ఆర్డీవో రాజు, భైంసా మండల తహసీల్దార్ రాజేందర్, తహసీల్దార్లు ఉన్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...