పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన నిందితుల అరెస్టు


Sat,March 16, 2019 12:42 AM

ఆదిలాబాద్ రూరల్ : నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్ 11న పోస్టాఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫోర్స్‌స్కేర్ సంస్థ నిర్వాహకులు పట్టణ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసి లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేశారని ప్రధాన నిందితులను గురువారం అరెస్టు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. పట్టణ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గత ఏడాది పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులతో సమావేశమై డబ్బులు ఇచ్చిన వెంటనే నియమాక పత్రాలు అందజేస్తామని లక్షల రూపాయలను డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయంలో ఓ వ్యక్తి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రూరల్ సీఐ, ఎస్సైలు దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకొని ల్యాప్‌టాప్, రిజిస్టర్లు, అపాయింట్‌మెంట్ లెటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిందితులు వారు కాదని మరి కొందరు సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఎండీ పాషాను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు వివరించారు. మరో నిరుద్యోగి ఇటీవలే ప్రధాన నిందితునిడి వివరాలు తెలపగా నాగారం కల్యాణ్‌కుమార్‌ను 24 గంటల్లోనే అరెస్టు చేశామని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే రూరల్ సీఐ, ఎస్సైలు స్పందించడంతో కొంత మందిని అరెస్టు చేయగలిగామని అన్నారు. బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించేందుకు రూరల్ పోలీసులు చాలా కృషి చేశారని అభినందించారు. ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని నిరుద్యోగులను మోసం చేసిందని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు 300 మంది బాధితులు ఉంటారని తెలిపారు. రూరల్ పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించగా.. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. సమావేశంలో రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...