నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు


Sat,March 16, 2019 12:42 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ జవాజీ సురేశ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రాక్టర్ డ్రైవర్లకు, ఓనర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరమని పట్టణంలో ట్రాక్టర్లను నెమ్మదిగా నడపాలని సూచించారు. ట్రాక్టర్లలో ఇసుక ఓవర్ లోడింగ్‌తో వేగంగా తీసుకరావడంతో వెనుక వచ్చే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని దీంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయన్నారు. ఘటనలపై కొంత మంది వాహన చోదకులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు సైతం చేశారన్నారు. ట్రాక్టర్లలో ఇసుక తరలించే క్రమంలో బాడిలెవల్ ఇసుక నింపి దానిపై తాడిపత్రిని కప్పి తీసుకురావాలని సూచించారు. పంజాబ్ చౌక్ నుంచి మొదలుకొని ఠాగూర్ హోటల్ వరకు ఇసుక లారీలను రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేస్తున్నారన్నారు. దీంతో ఈ రహదారి గుండా వచ్చి వెళ్లే వాహనాలకు ఇబ్బందులు కలిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయరాదన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు రోజు వారీగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై విఠల్, సిబ్బంది ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...