గెలుపు ఖాయం.. మెజార్టీయే లక్ష్యం


Thu,March 14, 2019 12:30 AM

- పక్కా ప్రణాళికలతో సిద్ధమైన టీఆర్‌ఎస్
- ప్రజల దరి చేరిన ప్రభుత్వ పథకాలు
- గులాబీ పార్టీకే సబ్బండవర్ణాల ఆదరణ
- కనీస పోటీ ఇవ్వలేని కాంగ్రెస్
- బరిలో నిలిచేందుకు జంకుతున్న హస్తం పార్టీ నేతలు


ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : రా బోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ హ వా కొనసాగనుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించా రు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. ఆసిఫాబాద్ నుంచి తక్కువ ఓట్లతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరా రు. జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు దారులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఐదేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీదే హవా కొనసాగుతున్నది. వచ్చేనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజ యం సాధించడం ఖాయమైనట్లే. టీఆర్‌ఎస్ నా యకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తు తం పార్లీమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి బలమైన నాయకులు, కార్యకర్తలు ఉండడంతో విజయం దాదాపు ఖరారైందని చెప్పవచ్చు.

కాంగ్రెస్ పోటీ నామమాత్రమే..
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ నామమాత్రమే కానుంది. అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి జై కొడుతున్న ఈ పరిస్థితుల్లో హస్తం పార్టీ కేవలం ఉనికిని కాపాడుకోవడం కోసమే పో టీ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో భారీ మెజార్టీయే లక్ష్యంగా గులాబీ పార్టీ నాయకులు వ్యూహ ప్రతి వ్యూహాలను రూపొందిస్తున్నారు. లోక్‌సభ షెడ్యూల్ రావడంతో జిల్లాలోని రాజకీయం వేడెక్కింది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకోగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మరో నేత నరేశ్ జాదవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే సోయంబాపురావులు పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ సైతం తమ అభ్యర్థిని ఈ నియోజకవర్గం నుంచి బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి.

భారీ మెజార్టీకి ప్రణాళికలు..
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం దాదాపు ఖాయం కాగా.. భారీ మెజార్టీపైనే నాయకులు దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లాలోని మారుమూల గిరిజన గూడాలు, తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో పాటు రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబస్తీ, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, గొర్రెల పంపిణీ లాం టి పథకాలు జిల్లా ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసరా పింఛన్లు ఏప్రిల్ నెల నుంచి రెట్టింపు కానుండగా.. నిరుద్యోగ భృతికి సైతం నిబంధనలు రూపొందిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో ప్రజలు గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...