ముగిసిన ఇంటర్ పరీక్షలు


Thu,March 14, 2019 12:28 AM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన బుధవారం పరీక్షా కేంద్రాలను రాష్ట్రస్థాయి అధికారులు తనిఖీ చేశారు.

29 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
జిల్లా వ్యాప్తంగా 5,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 5,535 మంది విద్యార్థులు హాజరయ్యారు. చివరి రోజు పరీక్షకు 349 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా నోడల్ అధికారి అలెగ్జాండర్ సోఫినగర్ గురుకుల పాఠశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల సెంటర్లను తనిఖీ చేశారు. ముథోల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 21 మంది విద్యార్థులను, భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు నోడల్ అధికారి అలెగ్జాండర్ తెలిపారు.

ఇంటి బాట పట్టిన విద్యార్థులు
ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఇంటిబాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్ల నుంచి ఇండ్లకు పయనమయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. బుధవారం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...