అడిగిన వెంటనే కూలీలకు పని కల్పించాలి


Thu,March 14, 2019 12:28 AM

దిలావర్‌పూర్: ఉపాధి హామీ పథకంలో భాగంగా అడిగిన వెంటనే కూలీలకు పని కల్పించాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం డీఆర్డీవో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల ఏర్పాటు పనులను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. నర్సరీల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏపీవో జగన్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ముథోల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకుని మండల సమాఖ్య సభ్యులు తయారు చేసిన ఫినాయిల్ విక్రయాలను బుధవారం ఆయన మండల కేంద్రంలో ప్రారంభించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నూర్‌మహ్మద్, ఐకేపీ ఏపీఏం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...