ల్రెక్క తేలింది..


Wed,February 20, 2019 11:22 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మ ల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఎంపీడీవోలకు శనివారం రోజున ఎంపీటీసీ స్థానాల గుర్తింపు ప్రక్రియపై ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ సీఈవో జి తేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ స్థానాల గుర్తింపు ప్రక్రియపై జడ్పీ సీఈవో ఎంపీడీవోలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కసరత్తు పూ ర్తి చేసిన ఎంపీడీవోలు.. ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నిర్ధారిత మండల జనాభాను పరిగణలోకి తీ సుకుని.. ప్రతి 3500మంది జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం చొప్పున ప్రతిపాదనలు తయారు చేశారు. కొన్ని మండలాల్లో ప్రతి ఎంపీటీసీ స్థానం పరిధిలో 3500జనాభా రాకపోగా.. కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నా కూడా సర్దుబాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొన్ని మండలాల్లో నాలు గు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉండడంతో.. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు పోగా.. ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే ఉండనున్నారు. మరో కోఆప్షన్ సభ్యుడు ఉంటారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో 636 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రామ పంచాయతీలను పాత మున్సిపాలిటీల్లో విలీనం చేయటంతో 71 ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. దీంతో జిల్లాలో ప్రస్తుతం 565ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు లెక్క తేల్చగా.. వీటికి సంబంధించి బుధవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతులను ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో బుధవారం(20వ తేదీ) నుంచి ప్రదర్శించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో గుర్తించిన ప్రకారం ఆయా ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఏయే గ్రామాలు వస్తాయో.. వాటి వివరాలు అందుబాటులో ఉంచారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ఏమైనా వినతులు, ఫిర్యాదులు, అ భ్యంతరాలు ఉంటే.. ఈ నెల 20, 21, 22 తేదీల లో ఎంపీడీవోలకు నేరుగా అందించవచ్చు. రాజకీ య నాయకులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఈ నెల 22వరకు స్వీకరిస్తారు. 23, 24తేదీలలో ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు, వినతులను కలెక్టర్ స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారు. అవసరమైన పక్షంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో సవరణలు చేసి 25వ తేదీన జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలను అందజేస్తారు. తుది జాబితాను ఈ నెల 25న సాయం త్రం ప్రకటిస్తారు.ఎంపీటీసీ స్థానాలపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్ పదవులు కలిసి రాని చాలా మంది ఔత్సాహికులు తాజాగా ఎంపీటీసీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు.

3500జనాభాను ప్రామాణికంగా తీసుకోగా.. 3వేల నుంచి 4వేల మధ్య జనాభా ఉన్న వాటిని కూడా ఎంపీటీసీ స్థా నాలుగా ఖరారు చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో.. ఔత్సాహికుల్లో ఆశలు పెరుగుతున్నాయి. తమ ఎంపీటీసీ స్థానం రిజర్వేషన్ ఏ విధంగా వస్తుందోననే.. లెక్కల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు జిల్లాలో గతం లో 52మండలాలు ఉండగా.. కొత్తగా 18మండలాలు ఏర్పాటు చేశా రు. దీంతో ఉమ్మడి జిల్లాలో మండలాల సంఖ్య 70కి చేరింది. ఇందులో 66గ్రామీణ మండలాలు ఉండగా.. వీటికి ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు ఉండనున్నాయి. మరోవైపు రెవెన్యూ జిల్లాల ప్రకారం నాలుగు జిల్లాలకు జడ్పీలను ఏర్పాటు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రేపో, మాపో వీటిని ప్రభుత్వానికి పంపుతుండగా.. ఈ నెల 25నాటికి ప్రభు త్వం ప్రకటించనుంది. జిల్లాలో ఎంపీటీసీ స్థానాలపై కసరత్తు పూర్తి చేసి.. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ బుధవారం జారీ చేశామని జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధితో పేర్కొన్నారు. జిల్లాలో 565 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు గుర్తించామని.. ఈ నెల 25న తుది ప్రకటన జారీ చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు జడ్పీలు, 66మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వివరాలు..
ఆదిలాబాద్ జిల్లాలో..
మొత్తం 17 మండల ప్రజా పరిషత్తుల పరిధిలో 156 ఎంపీటీసీ స్థానాలను విభజించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 10 ఎంపీటీసీ స్థానా లు, మావలలో 3, గుడిహత్నూర్‌లో 9, బజార్‌హత్నూర్‌లో 8, బేలలో 11, బోథ్‌లో 14, జైనథ్‌లో 14, తాంసిలో 5, భీంపూర్‌లో 7, తలమడుగులో 10, నేరడిగొండలో 8, ఇచ్చోడలో 12, సిరికొండలో 6, ఇంద్రవెల్లిలో 11, నార్నూర్‌లో 8, గాదిగూడలో 6, ఉట్నూర్‌లో 14 ఎంపీటీసీ స్థానాలు.
నిర్మల్ జిల్లా..
మొత్తం 18 మండల ప్రజా పరిషత్ పరిధిలో 156 స్థానాలుగా విభజన చేశారు. నిర్మల్ రూరల్ మండలంలో 7ఎంపీటీసీ స్థానాలు, సోన్‌లో 8, దిలావర్‌పూర్‌లో 6, నర్సాపూర్-జిలో 7, కడెంలో 10, దస్తురాబాద్‌లో 5, ఖానాపూర్‌లో 8, పెంబిలో 4, మామడలో 9, లక్ష్మణచాందలో 9, సారంగపూర్‌లో 14, కుభీర్‌లో 14, కుంటాలలో 7, భైంసాలో 11, ముథోల్‌లో 10, బాసరలో 6, లోకేశ్వరంలో 10, తానూర్‌లో 11 ఎంపీటీసీ స్థానాలు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...