వన్యప్రాణులను సంరక్షించాలి


Wed,February 20, 2019 11:21 PM

ఖానాపూర్: వన్యప్రాణులను, అడవులను సంరక్షించాలని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. బుధవారం ఆయన ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్టేషన్‌లో రికార్డులు, ఆవరణ, సెంట్రీ డ్యూటీ బరాక్, సెక్యూరిటీని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులను పెండింగ్‌లో ఉంచవద్దని, ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని సిబ్బందిని ఆదేశించారు. సంఘ వ్యతిరేక శక్తులపై గట్టి నిఘా పెట్టామన్నారు. అడవులను కాపాడే విషయమై పోలీసు శాఖకు ప్రభుత్వం పూర్తి అధికారాలను ఇచ్చిందన్నారు. టేకు చెట్లను నరికినా, వేటపేరుతో వన్యప్రాణులను చంపినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలప స్మగ్లింగ్, జంతువుల వేటను పూర్తిగా మానుకోవాలని సూచించారు. గడిచిన సాధారణ ఎన్నికలకు సహకరించినట్లుగానే రానున్న సార్వత్రిక ఎన్నికలకు కూడా జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఇబ్బందులు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఓటరు జాబితాల్లో తమ పేర్లున్నాయా లేదా అని ముందే పరిశీలించుకోవాలని, పేర్లు లేని వారు వెంటనే నమోదు చేయించుకోవాలని కోరారు. ఎన్నికల్లో తమకు నచ్చి పార్టీ అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటువేసి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఖానాపూర్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై గోగీకార్ ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...