బాసర ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు


Wed,February 20, 2019 11:20 PM

బాసర : నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. మిశ్రమ బంగారం 84 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 400 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 45 మొత్తం రూ.71,85,672 ఆదాయం సమకూరింది. ఈ మొత్తం ఆదాయం 62 రోజుల్లో వచ్చిందని ఆలయ ప్రతేక అధికారి అన్నాడీ సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ హుండీ ఆదాయం లెక్కింపులో ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఏఈవో గంగాశ్రీనివాస్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...