ఇంగ్లాండ్ టు న్యూజిలాండ్


Wed,February 20, 2019 11:20 PM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్‌కు సైకిల్ యాత్ర చేపట్టిన మార్టీన (46), నైగేల్ ఆంటోని (49) దంపతులు జిల్లా కేంద్రానికి బుధవారం చేరుకున్నారు. వీరికి వాసవీ పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇంగ్లాండ్ నుంచి తమ సైకిల్ యాత్రను ఏప్రిల్ 2010లో ప్రారంభించామని, మొత్తం 40 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 16 వేల కిలోమీటర్లు పూర్తిచేశామని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. సైకిల్ వాడకంతో కాలుష్యం తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించడమే ఉద్దేశమన్నారు. ఏప్రిల్ 2020 వరకు తమ యాత్ర పూర్తవుతుందని వివరించారు. విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ జగదీశ్ రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ సుహాసిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...