జిల్లాలో 135 ధాన్యం కొనుగోలు కేంద్రాలు


Wed,February 20, 2019 11:20 PM

నిర్మల్‌టౌన్ : యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 135 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు వెల్లడించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జేసీ చాంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లా అధికారులతో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌తో ముందుకెళ్తున్నామన్నారు. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా లక్షా 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో ధాన్యం సాగు అవుతున్నదని గుర్తించామని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 135 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డీఆర్‌డీఏ, ఐకేపీ, సహకార సంఘం, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలను త్వరలో నిర్ణయిస్తామన్నారు. కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తేమ శాతాన్ని పరిశీలించాలని, వర్షం పడితే తడవకుండా టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచాలని అన్నారు. ధాన్యం రవాణాపై యాక్షన్‌ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. గత సంవత్సరం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తిగా విజయంతంగా నిర్వహించేందుకు మార్కెటింగ్, డీఆర్‌డీఏ, డీఎస్‌వో తదితర శాఖాధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ అధికారి కోటేశ్వర్‌రావు, జిల్లా సహకార అధికారి సూర్యచందర్‌రావు, గ సివిల్ సప్లయ్ అధికారిణి శశికళ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి అమ్రేశ్ కుమార్, మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...