జిల్లాలో కొత్త మండలాలు


Sun,February 17, 2019 03:13 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: 2016 అక్టోబరు 11న ఆదిలాబాద్ జిల్లాను నాలుగు భాగాలుగా విభజించి నాలుగు జిల్లాలు గా ఏర్పాటు చేసే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్మల్‌ను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. నిర్మల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మం డలాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. నిర్మల్ రెవెన్యూ డివిజన్‌లో 13 మండలాలుండగా.. కొత్తగా మరో ఆరు మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా 19 మండలాలతో ఆవిర్భవించింది. ముథోల్ నియోజకవర్గంలోని మండలాలతో కలిపి భైంసాను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. తాజాగా మరో రెవెన్యూ డివిజ న్, నాలుగు కొత్త మండలాల ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలం పొన్కల్, సారంగాపూర్ మండలం బీరవెల్లి, లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని మాజీ మం త్రి, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ము ఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. మరోవైపు ఖా నాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, ముథోల్ నియోజకవర్గం తానూరు మండలం బెల్తరోడాను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎ మ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సీఎం ఆదేశాల మేరకు.. ఖా నాపూర్ రెవెన్యూ డివిజన్, నాలుగు కొత్త మండలాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంవో నుంచి జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం)కి ఆదేశాలు వెళ్లాయి. దీంతో రెవెన్యూ డివిజన్, మండలాల ఏర్పాటు ఏ మేరకు అవసరముంది.. ఎంత జనాభా ఉంది.. మండలాల మధ్య దూరం ఉంది అనే వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను సాధారణ పరిపాలన విభా గం ఆదేశించింది. దీంతో ఖానాపూర్ రెవెన్యూ డివిజన్, నాలుగు కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రతిపాదనల రూపంలో కలెక్టర్ సర్కారుకు సమర్పించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండు రెవెన్యూ డివిజన్లుండగా.. ఖానాపూర్ కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య మూడుకు చేరనుంది. జిల్లాలో ఇప్పటికే 19 మండలాలుండగా.. కొత్తగా నాలుగు మండలాల ఏర్పాటు చేసే అవకాశాలు ఉండడంతో వీటి సంఖ్య 23కి చేరనుంది. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రతిపాదనలు పంపాక.. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్త మండలాలు ఏర్పడితే ముథోల్ నియోజకవర్గంలో మండలాల సంఖ్య 8కి, నిర్మల్ నియోజకవర్గంలో 12కి చేరనుంది.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...