పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ బృందం


Sun,February 17, 2019 03:11 AM

లోకేశ్వరం : మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయం, జడ్పీ ఉన్నత పాఠశాల, ఎమ్మార్సీ కార్యాలయ్నా శనివారం జిల్లా మానిటరింగ్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. మొదట ఎమ్మార్సీ కార్యాలయానికి చేరుకొని విద్యార్థుల ఆధార్ డాటా నమోదు ప్రక్రియను పరిశీలించిన బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మార్సీల మూవ్‌మెంట్ రిజిస్టర్లను పరిశీలించి కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కస్తూర్బాలోని రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పలు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. జడ్పీ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. సిలబస్ ఎంత వరకు పూర్తయింది, రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకా రం రుచికరమైన భోజనం విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు సూచించారు. జిల్లా మానిటరింగ్ బృంద సభ్యులు పద్మ, రమణారెడ్డి, సలోని, ప్రధానోపాధ్యాయులు రమేశ్‌మార్, అనసూయ ఉన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...