వైకుంఠ ధామం.. పనుల్లో వేగం


Fri,February 15, 2019 12:11 AM

నిర్మల్ టౌన్: జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వైకుంఠధామాల నిర్మాణ పనుల కొనసాగుతున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పెద్దమొత్తం నిధులు విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రా మాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను నిధుల కొరత లేకుండా వైకుంఠధామాల నిర్మాణానికి ఉపాధిహామీ పథకంలో నిధులు మంజూరుచేసింది. జిల్లాలో కొత్త గ్రామపంచాయతీలను కలుపుకుని 396 జీపీలు ఉండగా, 226 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులన్నింటికీ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. పంచాయతీల తీర్మానం మేరకు అన్ని గ్రామాల్లో వైకుంఠధామల నిర్మాణానికి డీఆర్‌డీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా పాత 13 మండలాల్లో ఇప్పటి వరకు 118 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టగా.. 99 జీపీల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.

కూలీలకు చేతినిండా ఉపాధి...
జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో జాబ్‌కార్డు ఉన్న కూలీలకు పని కల్పిస్తూ జిల్లావ్యాప్తంగా వైకుంఠధామాల నిర్మాణం చేపట్టడంతో కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఈ పనుల ద్వారా కూలీలకు రూ.60 లక్షల 18వేల 025 డబ్బులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. వస్తుసామగ్రి కింద రూ. 4కోట్ల36లక్షల 93 వేల 571గా నిధులు ఖర్చు చేయడం జరిగింది. మొత్తంగా జిల్లావ్యాప్తంగా రూ. 4 కోట్ల 42లక్షల 95వేల 396 ఇప్పటివరకు వైకుంఠధామాల నిర్మాణానికి నిధులు ఖర్చు చేశారు. ఈ సంవత్సరం కూడా మిగిలిపోయిన గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 118 వైకుంఠధామాల నిర్మాణం చేపట్టగా.. 99 పూర్తయినట్లు అధికారులు చెప్పారు. మిగతా 19 గ్రామాల్లో పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. భైంసాలో 9, దిలావర్‌పూర్‌లో 7, కడెం పెద్దూర్‌లో 6, ఖానాపూర్‌లో 5, కుభీర్‌లో 10, కుంటాలలో 8, లక్ష్మణచాందలో 9, లోకేశ్వరంలో 7, మామడలో 6, ముథోల్‌లో 15, నిర్మల్‌లో 15, సారంగాపూర్‌లో 15, తానూరులో 6 వైకుంఠధామాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

ఆధునాతన హంగులతో నిర్మాణాలు...
ప్రతి గ్రామంలో వైకుంఠధామాలను ఆధునాతన హంగులతో ప్రజలకు ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు. గతంలో ఆయా గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలంలో అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. దీనికితోడు నీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉండడంతో అంతక్రియల్లో పాల్గొనే వారు అష్టకష్టాలు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మారుమూల గ్రామాల్లో సైతం వైకుంఠధామల నిర్మాణానికి ఉపాధిహామీ పథకంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఒక్కో నిర్మాణానికి రూ. 10లక్షల చొప్పున నిధులను మంజూరు చేసింది. వైకుంఠద్వారం (గేటు), సీసీ ప్లాంట్లు, శవం దించే గద్దె, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు, నల్లా నీటి సదుపాయం, మరుగుదొడ్లు నిర్మించారు. వివిధ రకాల పూలమొక్కలు నాటారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...