నాగోబా ఆదాయం 13.24 లక్షలు!


Thu,February 14, 2019 02:55 AM

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర హుండీలను బుధవారం లెక్కించారు. మెస్రం వంశీయులతోపాటు ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్‌శాఖలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. మొత్తం రూ.13 లక్షల 24 వేల 400ల ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ ఈవో రాజమౌళి తెలిపారు. ఇందులో వెండి 931 గ్రాములు, బంగారం
రెండు గ్రాములు వచ్చాయి. హుండీల్లో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.4.91 లక్షలు, తైబజార్ ద్వారా రూ.5.25 లక్షలు, రంగుల రాట్నాల ద్వారా రూ.1.50 లక్షలు, విద్యుత్ ద్వారా రూ.86 వేలు, టెంకాయల ద్వారా రూ.47,400, వాహనాల పార్కింగ్ ద్వారా రూ.25 వేల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం రూ.8.25 లక్షల ఆదాయం సమకూరగా.. ఈ సంవత్సరం అదనంగా రూ.4.98 లక్షల ఆదాయం పెరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ భీమ్‌రావ్, మెస్రం వంశీయులు పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్, ఐటీడీఏ అధికారి రమాదేవి, ఎస్సై గంగారామ్, దేవదాయశాఖ ఈవో రాజమౌళి, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, మాజి సర్పంచ్ మెస్రం నాగ్‌నాథ్, మెస్రం వంశీయులు మెస్రం మనోహర్, బాధిరావ్‌పటేల్, దాదారావ్, గణపతి, తీరుపతి, కటోడ హనుమంత్‌రావ్, తుకోడోజీ, కటోడ కోశరావ్, నాగోరావ్, దేవ్‌రావ్, సోనేరావ్, జంగు, తుకారామ్, శేఖు, పురుషోత్తమ్, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...