కిసాన్ సమ్మాన్ నిధిని పారదర్శకంగా అమలు చేయాలి


Thu,February 14, 2019 02:55 AM

నిర్మల్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అన్ని జిల్లాల్లో పారదర్శకంగా అమలు చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి జిల్లా వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై జిల్లా అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీసీలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అమ్రేశ్ కుమార్, ఏడీఏలు వినయ్‌బాబు, అంజు కుమార్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని ఐదేకరాలలోపు ఉన్న రైతులకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున మూడు విడతల్లో రైతు పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలో లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం తదితర వివరాలు సేకరించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సహాయం గుర్తించి ప్రస్తావించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...