పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల


Thu,February 14, 2019 02:54 AM

నిర్మల్ టౌన్ : జనవరి నెలలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా.. వివిధ కారణాలతో నిలిచిపోయిన సర్పంచులతో పాటు వార్డుమెంబర్ల ఎన్నికలకు ప్రభుత్వం షె డ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం అన్ని జిల్లా పంచాయతీ అధికారులకు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 396 గ్రామ పంచాయతీలుండగా.. అన్ని గ్రామ పంచాయతీల్లో గత నెల 21, 25, 30 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో సర్పంచులు ఎన్నికయ్యారు. ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వార్డుల్లో నామినేషన్ల తిరస్కరణ, వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఈ ఎన్నికలను వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా 15 వార్డులు ఖాళీగా ఉండగా.. ఈ వార్డులకు ఈ నెల 28న ఎన్నిక జరగనుంది.

విడుదలైన షెడ్యూల్...
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వార్డుమెంబర్లకు ఎన్నిక నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 14న ఎన్నికల నోటీసును ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో విడుదల చేసి 16 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన కార్యక్రమ ఉంటుంది. అదేరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 18న నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 19న అభ్యర్థులకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తారు. 20న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తారు. అదేరోజు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. 28న ఉదయం 7 గంటల నుంచి ఒం టి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ను నిర్వహించి గెలుపొందిన సర్పంచ్, వార్డుసభ్యుల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియను సజావు గా పూర్తి చేసేందుకు డీపీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఖాళీగా ఉన్న స్థానాలు ఇవే...
నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివి ధ మండలాల్లో ఖాళీగా ఉన్న వార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా మండలంలోని హం పోలి 6, 7 వార్డులు, కడెం మండలంలోని చిట్యాల్‌లో 5వ వార్డు, కుభీర్ మండలంలోని అంతర్ని లో 5వ వార్డు, 6వ వార్డు, బెల్గంలో 2వ వార్డు, 8వ వార్డు, పల్సితండాలో ఒకటో, 2వ వార్డు, సౌనలో ఒకటో వార్డు, 6వ వార్డు, కుంటా ల మండలంలోని అందకూర్ గ్రామంలో 6వ వా ర్డు, ముధోల్ మండలంలోని విఠోలితండా ఒకటో వార్డు, వడ్తాల 11వ వార్డు, పెంబి మండలంలోని దుంధరి 5వ వార్డు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా మండలాల్లోని గ్రామాల్లో జరిగే ఉప ఎన్నికలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...