కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు


Thu,February 14, 2019 02:52 AM

నిర్మల్‌అర్బన్/నమస్తే తెలంగాణ : పట్టణంలోని చింతకుంటవాడలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన బుధవారం ఉత్సవాలు కొనసాగగా.. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య చండీ మహాయాగం, పుష్పఫలం, మంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాలకు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శంకరాచార్య విద్యారణ్యభారతి చేతుల మీదుగా గురువారం నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపన చేపడుతున్నట్లు నిర్వాహకుడు లక్కడి జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గండ్రత్ రమేశ్, రాజేశ్వర్, రమణ, రాజు, శ్రీకాంత్, పోగుల రాజేందర్, అడ్ప గణేశ్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...