ప్రభుత్వ కళాశాల్లోనే నాణ్యమైన విద్య


Wed,February 13, 2019 12:49 AM

కుభీర్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని జూనియర్ కళాశాలకు ఒక ఎకరం సొంత భూమిని దానం చేసిన భూదాత దొంతుల లింగన్న అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇందుకు గాను కేజీ టూ పీజీ విద్యను అమల్లోకి తేవడంతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పేద విద్యార్థులకు కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను పరీక్షల్లో ప్రతిభ చూపాలని సూచించారు. కష్టపడి చదవడంతో పాటు క్రమశిక్షణ, అంకితభావం విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని తానూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భోజరాం పేర్కొన్నారు. విద్యతోనే ప్రతి ఒక్కరికీ గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు విద్యార్థులు తమ అనుభవాలను నెమరువేసుకున్నారు. కళాశాలలో బోధనా సిబ్బందిని విద్యార్థులు సత్కరించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేస్తూ.. హంగమా చేశారు. ప్రిన్సిపాల్ రామారావు, అధ్యాపకులు సంపత్‌కుమార్, రమేశ్ తదితరులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...