రైతుల అభ్యున్నతికి కృషి


Mon,February 11, 2019 11:14 PM

ఉట్నూర్ రూరల్ : రైతులకు లబ్ధిచేకూర్చడానికి ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన గోదాముల్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా లాభాలు అందించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి మండలంలో కోట్లాది రూపాయలతో గోదాంలు నిర్మించామన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు వ్యవసాయ పనిముట్లు రాయితీపై అందించనున్నట్లు వివరించారు. మండలంలోని మత్తడిగూడ గ్రామంలో మత్తడిచెరువును అభివృద్ధి పరుస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏటీడబ్ల్యూ చైర్మన్ కనక లక్కేరావు, జడ్పీటీసీ జగ్జీవన్‌రావు, ఎంపీటీసీలు అమీనాబీ, శారద, కందుకూరి రమేశ్, సర్పంచ్‌లు జనార్దన్, కళావతి, మాజీ సర్పంచ్ తిరుపతి, కోఆప్షన్ సభ్యుడు ముజీబ్‌ఖాన్, నాయకులు అజీం, ఎస్పీరెడ్డి, సెడ్మకి సీతారాం, కోల సత్తన్న, పంద్ర జైవంత్‌రావు, దాసండ్ల ప్రభాకర్, నాయకులు, రైతులు ఉన్నారు.

అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే
సరస్వతీ దేవి పుట్టినరోజు సందర్భంగా మండలం కేంద్రంలోని సన్‌షైన్ పాఠశాలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ షబ్బీర్, సిబ్బంది ఉన్నారు.
సర్పంచులకు సన్మానం
ఇంద్రవెల్లి : నూతనంగ ఎన్నికైన సర్పంచులు గ్రామభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సోమవారం మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మొదట మండలంలోని 26 మంది సర్పంచ్‌ను సన్మానించారు. ప్రతి సర్పంచ్‌ను పేరుపేరున పలకరిస్తూ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరష్కరించాలన్నారు. సర్పంచ్‌లతో సాధ్యం కాని పనులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సర్పంచ్‌లు గుర్తించిన సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రజలతో కలిసి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ప్రతి సర్పంచ్ అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, జడ్పీటీసీ సంగీత, ఎంపీటీసీలు కనక హనుమంత్‌రావ్, కోవ రాజేశ్వర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ నాయకులు షేక్ సుఫియాన్, మారుతి, రామ్‌దాస్, అంజద్, వసంత్‌రావ్, నగేశ్, శ్రీనివాస్, సుంకట్‌రావ్, సర్పంచులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...