పారదర్శకత కోసమే స్మార్ట్‌ఫోన్లు


Mon,February 11, 2019 11:14 PM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : అంగన్‌వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసమే సెల్‌ఫోన్లు అందజేస్తున్నట్లు ఉట్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఏసీడీపీవో శారద అన్నారు. సోమవారం మండలంలోని గంగన్నపేట్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజు వారి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుచేసేందుకు స్మార్టు ఫోన్లు అందించామన్నారు. ఉట్నూర్ పరిధిలోని 252 సెంటర్లకు ఫోన్లు అందించామన్నారు. మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది రత్నమాల, ముక్తా ఉన్నారు.
నార్నూర్‌లో...
నార్నూర్ : మండలంలోని అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసినట్లు ఐసీడీఎస్ అస్టిసెంట్ తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి, సంక్షేమ పథకాల పర్యవేక్షణ కోసం పూర్తి సమాచార సేకరణకు ప్రభుత్వం శిశు సంక్షేశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫోన్లు పంపిణీ చేశామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...