భగీరథ నీటిపై అపోహలను తొలగించాలి


Mon,February 11, 2019 11:14 PM

నిర్మల్‌టౌన్ : మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతు న్న నీటిని ప్రజలు నిరభ్యంతరంగా సేవించవచ్చని మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా జిల్లా కన్సల్టెంట్ తిరుపతి అన్నా రు. మిషన్ భగీరథ, తాగునీ టి పథకాల ప్రణాళిక, నిర్వహణ, తాగునీటి నాణ్యత పరిశీలనపై నిర్మల్, సారంగాపూర్, నర్సాపూర్(జీ), దిలావర్‌పూర్, లక్ష్మణచాంద మం డలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు సోమవారం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చేస్తున్నప్పటికీ అపోహలు తలెత్తడంతో కొందరు నీటిని సేవించడం లేదన్నారు. నీటి నాణ్యతపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ టీచర్లకు, ఆశ కార్యకర్తలకు సూచించారు. ప్రయోగాత్మకంగా నీటి శుద్ధికి సంబంధించిన వివరాలను తెలుపాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...