పల్లెనిండా.. గులాబీ జెండా..


Mon,January 21, 2019 11:37 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో తొలి విడతలో భాగంగా 134 గ్రామపంచాయతీలు, 1058 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో 57 గ్రామ పంచాయతీలు, 574 వార్డులు ఏకగ్రీవం కాగా.. 77 గ్రామ పంచాయతీలు, 480 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. మరో నాలుగు వార్డుల్లో నామినేషన్ల తిరస్కరణ, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఎన్నికలు జరగలేదు. జిల్లాలో 134 గ్రామ పంచాయతీల్లో 104 గ్రామపంచాయతీల్లో టీఆర్ మద్దతుదారులు విజయం సాధించారు. మరో 21 చోట్ల ఇతరులు గెలుపొందగా.. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కేవలం 8 గ్రామపంచాయతీల్లో గెలిచారు. వందకు పైగా స్థానాల్లో టీఆర్ మద్దతుదారులు విజయం సాధించి సత్తా చాటారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రభావం ఏ మాత్రం లేకపోవడంతో మద్దతుదారులు ఘోర పరాజయం చవిచూశారు. పెంబి మండలంలో 24 జీపీలకు అన్నిచోట్ల టీఆర్ మద్దతుదారులే ఎన్నికయ్యారు. ఏకగ్రీవాలతో పాటు ఎన్నికల్లోనూ టీఆర్ మద్దతుదారులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

ఏకగ్రీవంతోపాటు ఎ్నకల్లోనూ ఆధిపత్యం
జిల్లాలో 134 స్థానాలకుగాను 57 చోట్ల ఏకగ్రీవం కాగా.. ఇందులోనూ పూర్తిస్థాయిలో టీఆర్ ఆధిపత్యం కనబరిచింది. 57 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో 55 గ్రామ పంచాయతీల్లో టీఆర్ మద్దతుదారులు సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకచోట బీజేపీ మద్దతుదారులు, మరోచోట ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవాలు పూర్తిస్థాయిలో టీఆర్ మద్దతుదారులకే ప్రజలు అండగా నిలిచారు. లక్ష్మణచాందలో నాలుగు గ్రామ పంచాయతీలకుగాను మూడుచోట్ల టీఆర్ ఒకచోట బీజేపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మామడలో 13 గ్రామ పంచాయతీలకుగాను 13 చోట్ల టీఆర్ పెంబిలో 20జీపీలకుగాను 20చోట్ల, ఖానాపూర్ పది జీపీలకుగాను పదిచోట్ల, కడెంలో 9 జీపీలకుగాను 9 చోట్ల టీఆర్ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దస్తురాబాద్ ఒకచోట ఏకగ్రీవం కాగా.. ఇతరులు ఏకగ్రీవమయ్యారు. మరోవైపు ఎన్నికలు జరిగిన 77 స్థానాల్లోనూ 49 గ్రామపంచాయతీలను టీఆర్ మద్దతుదారులు దక్కించుకున్నారు. లక్ష్మణచాంద మండలంలో 14 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 9 చోట్ల టీఆర్ మద్దతుదారులు, నాలుగుచోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఒకచోట ఇతరులు గెలిచారు. మామడ మండలంలో 14 గ్రామపంచాయతీలకుగాను 10 చోట్ల టీఆర్ మూడు చోట్ల కాంగ్రెస్, ఒకచోట ఇతరులు విజయం సాధించారు. కడెం మండలంలో 19 గ్రామ పంచాయతీలకుగాను 9చోట్ల టీఆర్ పదిచోట్ల ఇతరులు గెలిచారు. దస్తురాబాద్ మండలంలో 12 గ్రామపంచాయతీలకుగాను ఏడు చోట్ల టీఆర్ నాలుగు చోట్ల కాంగ్రెస్, ఒకచోట ఇతరులు గెలుపొందారు. ఖానాపూర్ 14 గ్రామ పంచాయతీలకుగాను పది చోట్ల టీఆర్ నాలుగుచోట్ల ఇతరులు గెలిచారు. పెంబిలో నాలుగు గ్రామ పంచాయతీలకుగాను అన్నిచోట్ల టీఆర్ మద్దతుదారులే విజయం సాధించారు. రాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. పలుచోట్ల చిన్న చిన్న వివాదాలు నెలకొన్నాయి.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...