మాతాశిశు మరణాలను అరికట్టడమే ప్రభుత్వం లక్ష్యం


Mon,January 21, 2019 11:35 PM

ఇంద్రవెల్లి : మాతా శిశు మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుందని ఏఎన్ జిల్లా నోడల్ అధికారిణి డాక్టర్ సాధన, పీవోడీటీటీ మనోహర్ అన్నారు. సోమవారం మండలంలోని ఇంద్రవెల్లి ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పీహెచ్ గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన స్కానింగ్ యంత్రంతోపాటు అందించే మందులను పరిశీలించారు. దవాఖానలో ప్రతి నెలా జరుగుతున్న ప్రసూతి వివరాలను అడిగితెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గర్భిణుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుర్తించిన సమస్యల నివారణ కోసం మెరుగైన వైద్యం అందించి మాతాశిశువుకు పూర్తి రక్షణ చర్యలు కల్పించనున్నట్లు వివరించారు. ప్రతి నెలలో రెండు, మూడు రోజులకు ఒక సారి గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మేజర్ సమస్యలు ఉంటే జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించి గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రతి గర్భిణి ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవం చేయించుకోవాలని, వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అందుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు సాహిత్య, శ్రీకాంత్, సీహెచ్ రాథోడ్ బాబులాల్, హెల్త్ వైజర్ శ్రీనివాస్, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...