పన్ను వసూళ్లలో అగ్రస్థానంలోకుభీర్ మండలం


Mon,January 21, 2019 11:35 PM

కుభీర్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో పన్ను వసూళ్లు ఊపందుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు మండలంలోని 41 గ్రామాల్లో వివిధ పన్ను రూపంలో రూ. 7,26,600 వసూలైందని, పన్ను వసూళ్లలో కుభీర్ మండలం అగ్రస్థానంలో నిలిచిందని ఈవోపీఆర్డీ ఆసూరి గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుభీర్ గ్రామ పంచాయతీలో రూ.లక్షా 38 వేలు, మాలేగాంలో రూ. 46,147, నిగ్వాలో రూ. 50 వేలు, పల్సిలో రూ. 57వేలు, అంతర్నిలో రూ. 4,190, బెల్గాంలో రూ.16,225, దార్ రూ. 21,545, బెల్గాం తండాలో రూ. 27,925, కుప్టిలో రూ.28,944, సోనారిలో రూ. 10,225, హంపోలిలో రూ. 14,942, చొండిలో రూ.11 వేలు, కస్రాలో రూ. 20,300, జుమ్డాలో రూ. 26,300, పల్సి తండాలో రూ.3,780, సిర్పెల్లి(హెచ్)లో రూ. 8,120, పల్సిలో రూ.45,330, పార్డి(కే)లో రూ.9,510, జామ్ రూ. 4,320, గొడిసెరలో రూ.17,750, సాంగ్విలో రూ. 17,195, డోడర్నలో రూ.17,650, రాంనాయక్ తండాలో రూ. 19,400, దావుజీ నాయక్ తండాలో రూ.24,450, కిషన్ నాయక్ తండాలో రూ.19,300, పాంగ్రాలో రూ.13,520, సౌనలో రూ. 6,210, సిర్పెల్లిలో రూ.7,220, ఫకీర్ తండాలో రూ.7,720, వీరేగాంలో రూ.6,535, పార్డి(బీ)లో రూ.7,637, మార్లగొండలో రూ.7,940, బ్రహ్మేశ్వర్ రూ.2,665, హల్దాలో రూ.3,100, ఛాతాలో రూ.20,860, శివినిలో రూ.8,140, సాంవ్లీలో రూ.39 వేలు, న్యూ సాంవ్లీలో రూ.40 వేలు, మోలాలో రూ.12వేలు వసూలైనట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...