తొలి విడత పోలింగ్ 82.92 శాతం


Mon,January 21, 2019 11:34 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో 134 గ్రామపంచాయతీలు, 1058 వార్డులకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 57 గ్రామపంచాయతీలు, 574 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 77 గ్రామ పంచాయతీలకు, 480 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మరో నాలుగు వార్డులకు నామినేషన్లు రాకపోవడం, తిరస్కరించడంతో ఎన్నికలు జరగలేదు. ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నిర్మల్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి మండలాలతో పాటు నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, లక్ష్మణచాంద మండలాల్లో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసుశాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా, పారదర్శకంగా పోలింగ్ కొనసాగింది.

పోలింగ్ మహిళలదే ఆధిపత్యం
జిల్లాలో 77 గ్రామ పంచాయతీ పరిధిలో 83,473 మంది ఓటర్లుండగా.. ఇందులో 40,245 పురుషులు, 43,419 మంది మహిళలు, 8 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తం 70,211 మంది ఓటర్లు పోలింగ్ పాల్గొనగా.. 30,481 మంది పురుషులు, 39729 మంది మహిళలు, ఒకరు ఇతరులు పోలింగ్ పాల్గొన్నారు. జిల్లాలో సగటున పోలింగ్ 82.92శాతం నమోదైంది. అత్యధికంగా దస్తురాబాద్ మండలంలో 85.16శాతం, అత్యల్పంగా ఖానాపూర్ మండలంలో 78.71శాతం పోలింగ్ నమోదైంది. పెంబిలో 81.29శాతం, లక్ష్మణచాందలో 84.44శాతం, కడెంలో 82.93శాతం, మామడలో 83.61శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. ఆరు మండలాల్లో ఎన్నికలు జరిగిన 77 గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉండగా.. పోలింగ్ మహిళలదే ఆధిపత్యం కొనసాగింది. పురుషుల కంటే మహిళ ఓటర్లు 3174 మంది అధికంగా ఉండగా.. పోలింగ్ పురుషుల కంటే మహిళలు 9248 మంది అధికంగా పోలింగ్ పాల్గొన్నారు.

ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. తొలి గంట సేపు మందకోడిగా సాగింది. 8 గంటల వరకు సగటున పోలింగ్ 7.21శాతం నమోదు కాగా.. 9 గంటల వరకు 20.75శాతం నమోదైంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ పది గంటలకు 44.61శాతానికి చేరింది. 11 గంటలకు ఏకంగా 64.97శాతానికి పోలింగ్ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 76.61శాతం నమోదు కాగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు 82.92శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల ఒంటి గంట తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మారుమూల గ్రామాల్లోనూ ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పెద్ద మొత్తంలో పోలింగ్ నమోదైంది. మరోవైపు పెంబి లాంటి మండలాల్లోనూ పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు కాగా.. పోలింగ్ శాతం కూడా పెద్ద ఎత్తున నమోదైంది.

ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
జిల్లాలో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు అబ్దుల్ అజీం తనిఖీ చేశారు. కలెక్టర్ ఎం.ప్రశాంతి ఖానాపూర్ పాటు పలు మండలాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎస్పీ శశిధర్ జాయింట్ కలెక్టర్ భాస్కర్ కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

టీఆర్ గ్రామ స్వరాజ్యం
దిలావర్ టీఆర్ గ్రామ స్వరాజ్యం సాధ్యమని, టీఆర్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అల్లోల ఇంద్రరణ్ కోరారు. మండలంలోని గుండంపల్లి, దిలావర్ న్యూలోలం, కదిలి, మాడె గాం, సిర్గాపూర్, కాల్వ గ్రామాల్లో టీఆర్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే సోమవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి పెద్ద పీట వేస్తోంద న్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. టీఆర్ బలపర్చిన అభ్యర్థులను గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి వైపు పరుగుపెడతాయని, ఓడిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మితే ఊళ్లు బాగుపడవని, ఓటర్లు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ముల దేవేందర్ డాక్టర్ మల్లికార్డున్ అల్లోల ప్రశాంత్ ముస్కు ముత్యంరెడ్డి, ఏలాలా చిన్నారెడ్డి, టీఆర్ మండల అధ్యక్షుడు కోడే రాజేశ్వర్, దనే రవి, నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దనే నర్సయ్య, కోడే నవీన్, ఓడ్నం కృష్ణ, రామాగౌడ్, స్వామిగౌడ్, ఆనందం, సప్పల రవి, నీలకంఠరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సాపూర్ (జీ) మండలంలో..
నర్సపూర్(జీ)మండలంలోని టెంబుర్నీ, రాంపూర్, నర్సపూర్(జీ), కుస్లీ, అంజనీతండా గ్రామాల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే ఐకే రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. నియోజక వర్గంలోని 128 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే టీఆర్ బలపర్చిన 35 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగతా గ్రామాల్లో సైతం టీఆర్ హవా ఉంటుందన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. వారందరికీ డబుల్ బెడ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కోండ్రు రేఖ, ఎంపీటీసీలు కొమ్ముల సవిత, మైస లక్ష్మి, బర్కుంట సవిత, మాజీ సర్పంచ్ చిన్న రామయ్య, మాజీ ఉప సర్పంచ్ సుధాకర్, కోండ్రు రమేశ్, గంగారెడ్డి, మైస విజయ్, సాయినాథ్, గంగారాం, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గ్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...