రెండో రోజూ అదే జోరు


Sun,January 13, 2019 02:21 AM

నిర్మల్ అర్బన్, నమస్తే తెలంగాణ : జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రకియ జోరందుకుంది. శుక్రవారం నుంచి రెండో విడత నామినేషన్లు ప్రారంభంకాగా శనివారం జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 220మంది, వార్డు స్థానాలకు 293 మంది నామినేషన్లు దాఖలు చేయగా, రెండో రోజు 131 సర్పంచ్ స్థానాలకు 134, 1170 వార్డు స్థానాలకు 583 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి, రెండవ రోజుల్లో మొత్తం సర్పంచ్ స్థానాలకు 354, వార్డు స్థానాలకు 875 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
రెండో విడతలో నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్, సోన్, సారంగాపూర్, దిలావర్ నర్సాపూర్(జి), ముథోల్ నియోజక వర్గాల్లోని నర్సాపూర్(జీ), లోకేశ్వరం, కుంటాల మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏడు మండలాల పరిధిలోని 131 గ్రామ పంచాయతీలకు, 1170 వార్డులకు ఎన్నికలుంటాయి.

నామినేషన్ దాఖలుకు ఆదివారం చివరి తేదీ కావడంతో రెండవరోజైన శనివారం జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామపంచాయతీల్లో పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.
సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డుమెంబర్లు పెద్ద ఎత్తున తమ మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ క్లస్టర్ కేంద్రాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆదివారం చివరి రోజు కావడంతో సర్పంచ్, వార్డు స్థానాలకు దాఖలు కానున్న నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. శనివారం లోకేశ్వరం మండలంలో సర్పంచ్ స్థానాలు 21 మంది, వార్డు స్థానాలకు 76 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిర్మల్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 43 మంది, వార్డు స్థానాలకు 121 మంది, సోన్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 31 మంది, వార్డు స్థానాలకు 141 మంది, సారంగాపూర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 77 మంది, వార్డు స్థానాలకు 177 మంది, దిలావర్ మండలంలో సర్పంచ్ స్థానాలకు 35 మంది, వార్డు స్థానాలకు 73 మంది, నర్సాపూర్ (జీ) మండలంలో సర్పంచ్ స్థానాలకు 49 మంది, వార్డు స్థానాలకు 95 మంది, కుంటాల మండలంలో సర్పంచ్ స్థానాలకు 50 మంది, వార్డు స్థానాలకు 152 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...