తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్


Sun,January 13, 2019 02:20 AM

కుభీర్ : గిరిజన తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని పల్సి గిరిజన తండావాసులు అన్నారు. శనివారం మండలంలోని పల్సి గిరిజన తండా-2లో పల్సి తండా-1 గ్రామస్తు లు కలిసి నిర్వహించిన సమావేశంలో జాదవ్ తిత్రిబాయిని సర్పంచిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మా నం చేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ అభ్యర్థి జాదవ్ సుభాష్ కలిసి తిత్రిబాయి మాట్లాడుతూ.. గిరిజన తండాలను జీపీలుగా మార్చి, ప్రభుత్వ పాలనను ఎంతో చేరువ చేసిన ఘనత కేసీఆర్ దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో గిరిజన తండాలు ఎంతగానో అభివృద్ధి చెందనున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ. పది లక్షల పారితోషికంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీల సహాయ సహకారాలతో పల్సి తండా-1,2లను అభివృద్ధి చేస్తామన్నారు. తమను సర్పంచి, ఉప సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న రెండు తండాల గిరిజనులకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తిత్రిబాయిని శాలువా, పూలమాలతో గిరిజనులు ఘనంగా సత్కరించారు. అనంతరం రంగులు చల్లుకొని స్వీట్లు పంచుకున్నారు. శ్రీచందర్ మహరాజ్, రెండు తండాల నాయకులు కైలాస్ రాథోడ్, గంగారాం, శివాజీ, రూప్ గులాబ్ జాదవ్ సుభాష్, దత్తపవార్, పరుశురాం నాయక్, ఆడే ప్రభు, రమేశ్ రాథోడ్ మాన్సింగ్, యువకులు, గిరిజన మహిళలు ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...