వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తాం


Sat,January 12, 2019 02:58 AM

నిర్మల్ టౌన్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడూరి ప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంలో అనేక సంస్కర ణలు తీసుకొచ్చారని, ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేసిన ఘనత కేసీఆర్ ఉద్యోగులకు పెండింగ్ పీఆర్సీ బకాయిలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంపీ కవిత నేతృత్వంలో ఏర్పడిన ఈ సంఘం ఉద్యోగ, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విలాస్, ఉమ్మడి జిల్లా నాయకులు భూమన్న, నర్సయ్య, రహీంబాషా, ప్రభుదాస్, కే.రమేశ్, అన్వర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...