నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు


Sat,January 12, 2019 02:57 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించమని ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పలుచౌక్ కాలనీల్లో ట్రాఫిక్ నిబంధనలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎస్పీ విష్ణువారియర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నిబంధనలు పాటించక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలపకుండా రోడ్లకు అడ్డంగా నిలపడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఈ విషయమై పట్టణ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎవరైనా రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని, ఆటో డ్రైవర్లు యూనిఫారాలు వేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో జరిమానా తప్పదని హెచ్చరించారు. రాంగ్ సిగ్నల్ జంప్, అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే వారికి ఈ-చలాన్ ద్వారా జరిమానాలు విధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, ఆటో, జీపు డ్రైవర్లు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...