నేటి నుంచి రెండో విడత..


Fri,January 11, 2019 01:35 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో 396 గ్రామపంచాయతీలుండగా.. 3338 వార్డులు ఉన్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోనూ 134 గ్రామపంచాయతీలు, 1058 వార్డులకు నామినేషన్లను స్వీకరించారు. ఈనెల 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించగా.. వీటికి ఈనెల 21న పోలింగ్ నిర్వహించనున్నారు. 134 గ్రామపంచాయతీలకు 728 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు వేశారు. 1058 వార్డుల కోసం 1937 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 31 గ్రామపంచాయతీలకు సర్పంచ్ పదవికి ఒక్కటి చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా.. 484 వార్డులకు కూడా ఒక్కొక్కటి చొప్పున మాత్రమే నామినేషన్లు వచ్చాయి. దీంతో వీటిని ఏకగ్రీవం చేయనున్నారు. నామినేషన్లకు సంబంధించి గురువారం అధికారులు పరిశీలన చేయగా.. మొత్తం సర్పంచ్ స్థానాలకు 728 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 593 అర్హత సాధించాయి. వార్డు పదవుల 1937 నామినేషన్లు రాగా, 1890 అర్హత సాధించా మంది మిగిలారు.

రెండో విడతలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో నిర్మల్, సోన్, సారంగాపూర్, దిలావర్‌పూర్, నర్సాపూర్(జి), ముధోల్ నియోజకవర్గంలోని నర్సాపూర్(జి), లోకేశ్వరం, కుంటాల మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఏడు మండలాల పరిధిలోని 131గ్రామ పంచాయతీలకు, 1170 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడత ఎన్నికల నిర్వహణకు జనవరి 11న (శుక్రవారం) రిటర్నింగ్ అధికారులు నోటీసులు ఇస్తారు. జనవరి 11-13వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్లు పరిశీలన, 15న ఆర్డీవోలకు అప్పీలు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. 16న ఆర్డీవోలతో అప్పీలు పరిష్కారం, 17న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 25న పోలింగ్, ఓట్ల లెక్కింపు, వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల ఫలితాల ప్రకటన, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. రెండో విడత నామినేషన్ల స్వీకరణ కోసం 39 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 39 మంది రిటర్నింగ్ అధికారులను నియమించగా.. మరో 9 మందిని అదనంగా రిజర్వులో పెట్టారు. మూడు రోజుల పాటు నామినేషన్లను ఆయా క్లస్టర్‌లలో స్వీకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

130 గ్రామాల్లో ఎన్నికలు
జిల్లాలో రెండో విడత నామినేషన్ ప్రక్రియ శు క్రవారం నుంచి ప్రారంభమవుతుంది . జిల్లాలోని ఏడు మండలాల్లో 130 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నాం. 1170 వార్డు స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం 48 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు ఇతర సిబ్బందిని నియమించాం. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్ దాఖలు, 14న పరిశీలన, 15న అభ్యంతరాల స్వీకరణ, 16న తుది జాబితాను ప్రకటిస్తాం. ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినే షన్‌ల ప్రక్రియ కొనసాగుతుంది.
- శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...