కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


Fri,November 16, 2018 12:12 AM

కడెం : కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్‌వో కిరణ్‌కుమార్ సూచించారు. గురువారం మండలంలోని బెల్లాల్, కొండుకూర్, చిట్యాల్, లింగాపూర్, దస్తురాబాద్ మండలంలోని పెర్కపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం తూకం వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ రకానికి రూ. 1770, సాధారణ రకానికి రూ. 1750 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తేమశాతం 17 శాతం మించకూడదని సూచించారు. రైతులు కేంద్రాలకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా పట్టాదారు పాసుపుస్తకంతో పాటు, బ్యాంకు, ఆధార్‌కార్డుల జిరాక్స్ పత్రాలను తీసుకురావాలన్నా రు. సివిల్ సైప్లె డిప్యూటీ తహసీల్దార్ రహిమొద్దీన్, కవితరెడ్డి, సీఈవో రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

ఐకేపీ ఆధ్వర్యంలో..
మండలంలోని మద్దిపడగ, పాండ్వాపూర్, దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామాల్లో గురువారం ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు హాజరై కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో శ్రావణ్‌కుమార్, ఏపీఎం వనజ, సీసీలు గైనీ భూమన్న, స్వామి, లావణ్య పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...