టీఆర్‌ఎస్‌లో చేరిన గిరిజనులు


Fri,November 16, 2018 12:12 AM

ఖానాపూర్: పట్టణంలో గురువారం నిర్వహించిన ఓ సమావేశంలో పెంబి ప్రాంతానికి చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు తాళ్లపెళ్లి సునీత ఆధ్వర్యంలో సుమారు 200 మంది గిరిజనులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ ఆమె పాటుగా పెంబి మండల టీఆర్‌ఎస్ నాయకులు పుప్పాల శంకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికీ అభివృద్ధి పథకాలు అందాయన్నారు. మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పేదలందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో వెంకంపోచంపాడు, రాయధరి, కర్ణంలొద్ది గ్రామ పరిధిలోని శివలాల్ యూత్, కొమురంభీం యూత్‌లకు చెందిన సుమారు 250 మంది ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ కేహెచ్ ఖాన్, పుప్పాల శంకర్, తాళ్లపెళ్లి రాజగంగంన్న, డి. రాజారెడ్డి, కడార్ల గంగనర్సయ్య, అర్గుల శేఖర్‌గౌడ్, కాళేరి దివాకర్, గుగ్గిళ్ల సతీష్, కౌట మహేశ్, చౌహన్ మహేశ్, జాదవ్ అంబాజీ, రాథోడ గోవింద్, నల్లారి భీమన్న, చిన్ను పటేల్, భైరి సాయన్న, ధారాసింగ్, రోహిదాస్, దిగంబర్, పోతిరెడ్డి, భీం రామేశ్వర్ తదితరులున్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...