ప్రజలకు అండ


Wed,November 14, 2018 01:49 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ:ఉమ్మడి పాలనలో రాష్ట్రంలో 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధి నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని, అందుకే ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారని నిర్మల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్మల్ మండలం అనంతపేట్ గ్రామానికి చెందిన 400 మంది, పోచంపాడ్ గ్రామానికి చెందిన 200 మంది, వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన 250 మంది, చిట్యాల్ గ్రామానికి చెందిన 200 మంది సారంగాపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన 100 మంది, నిర్మల్ పట్టణం వైఎస్సార్ కాలనీకి చెందిన 70 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజాపాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారన్నారు. ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేని కాంగ్రెస్, టీడీపీలు అభివృద్ధిని జీర్ణించుకోలేకే మహకూటమిగా ఏర్పడి తెలంగాణను దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. కర్రు కాచి వాత పెట్టినట్లు ప్రజలు వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరిరావు, అల్లోల మురళీధర్‌రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ముత్యంరెడ్డి, చిట్యాల్ సర్పంచ్ రమేష్‌రెడ్డి, అనంతపేట్ ఎంపీటీసీ దాసరి పంతులు, మాజీ ఎంపీటీసీ నేరెళ్ల అశోక్, కోట చిన్న లింగన్న, చిన్న గంగన్న, కుంటాల రాజేశ్వర్, అలియాస్ రానా, పోలీసు భీమేష్, పోలీసు నవీన్ పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...