నేటి నుంచి బాలల హక్కుల వారోత్సవాలు


Wed,November 14, 2018 01:49 AM

ఆదిలాబాద్ టౌన్ : సెడ్స్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్‌లైన్‌తో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసం కలిసి నడుద్దాం అని చైల్డ్ లైన్ సే దోస్తీ అనే నినాదంతో బా లల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆర్ సురేందర్ తెలిపారు. స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చైల్డ్‌లైన్ 1098 తో కలిసి సెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఏడు నెలలుగా బాలల హక్కులపై వివిధ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చైల్డ్‌లైన్‌తో బాల ల హక్కులకు సంబంధించిన అవగాహన సదస్సులు, వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములై పని చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ బాల కార్మికులు, వీధి బాలలు, తప్పిపోయిన బాలలు గృహ లైంగిక వేధింపులకు గురైన వారు, విద్యాహక్కు కోల్పోయిన 168 మంది పిల్లలను గుర్తించి వారి ఇష్టానుసారం తగిన విధంగా పునరావాసం కల్పిస్తున్నామని చెప్పారు.

ఈనెల 14న బాలల దినోత్సవం నుంచి ఈనెల 20వ తేదీ వరకూ నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని వెళ్లడించారు. మొదటి రోజు కలెక్టర్, ఎస్పీలతో వారోత్సవాలకు సంబంధించిన చైల్డ్‌లైన్స్‌సే దోస్తీ పోస్టర్లను విడుదల చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు. 15వ తేదీన జైనథ్, బేల మండలాల్లోని పాఠశాల, కళాశాలల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
16న డ్రగ్ అబ్యూస్ అంశంపై రైల్వేస్టేషన్‌లో కార్యక్రమం చేపడుతామని చెప్పారు. 17న విద్యాశాఖతో కలిసి పలు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. 18న వివిధ శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లను కట్టే కార్యక్రమం ఉంటుందని, 19న బాలల హక్కులపై క్యాం డిల్ ర్యాలీ, 20న ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలు చేపట్టేందుకు చైల్డ్‌లైన్, 1098 తగిన ఏర్పాట్లు చేసిందని వివరించారు. సెడ్స్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ తిరుపతి, అకౌంటెంట్ రాజన్న, కౌన్సిలర్ మమత, సిబ్బంది రాకేశ్, సదానంద్, సతీశ్, వైశాలి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...