అల్లోల విజయం ఖాయం


Sun,November 11, 2018 04:48 AM

సారంగాపూర్: నిర్మల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోరిగాం గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయన్నారు. ప్రజలు మహాకూటమి మాటలు నమ్మిమోసపోవద్దని సూచించారు. కారుగుర్తుకు ఓటు వేసి అల్లోలను భారీ మెజార్టీతో గెలించాలని కోరారు.
టీఆర్‌ఎస్‌లో 250 మంది చేరిక...
గ్రామంలోని వివిధ యూత్‌సభ్యులు 250 మంది మంత్రి సోదరుడు అల్లోల మరళీధర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు యూత్‌సభ్యులు తెలిపారు. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేరాజేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్‌మహ్మద్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, నాయకులు జీవన్‌రావ్, మాధవరావు, మాణిక్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, బొబ్బిలి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...