అల్లోలను ఆదరించండి


Sat,November 10, 2018 12:00 AM

సోన్: ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి అల్లోల సతీమణి విజయలక్ష్మి ఓటర్లను కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కుటుంబసభ్యులైన కోడలు దివ్యారెడ్డి, కూతురు పల్లవి, వినోదమ్మ కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, ఎంపీటీసీ సభ్యులు విద్యుల్లత వినోద్, రాజేశ్వర్, మండల ఉపాధ్యక్షులు నర్సయ్య, కాంతయ్య, బూత్ కమిటీ సభ్యులు గంగాధర్, జగన్, తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...