రైతు కష్టానికి కత్తెర


Fri,November 9, 2018 03:01 AM

ఎ- తానూర్ : న్నో ఆశలతో మొక్కజొన్నసాగు చేస్తున్న రైతన్నను కత్తెర పురుగు ముంచుతోంది. పంటను ఆశించిన కత్తెర పురుగు నివారణకు మార్గం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తానూర్ మండలంలోని కోలూర్ గ్రామానికి చెందిన గోసలోల్ల సాయినాథ్ అనే రైతు తనకున్న మూడెకరాల భూమిలో మొక్కజొన్న సాగు చేశాడు. పంటను రక్షించుకునేందుకు రాత్రి, పగలు కష్టపడి నీరందించాడు. అయితే పంటకు కత్తెర పురుగు వ్యాపించింది. సాయినాథ్ పురుగు నివారణకు ఎన్నో మందులు పిచికారీ చేసినప్పటికీ లాభం లేకపోయింది. చివరికి చేసేది లేక మూడు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నను గురువారం దున్నేశాడు. ఎకరానికి రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టానని, తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...