ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రగతి


Tue,November 6, 2018 11:47 PM

ఖానాపూర్: జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గ్రామాలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలను కల్పించుకోవచ్చని ఈజీఎస్ జిల్లా పీడీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఖానాపూర్ ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈజీఎస్ పనుల ప్రజావేదిక పరిశీలనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఉపాధి పథకం ద్వారా ప్రజలకు అవసరమైన ఎన్నో పనులు చేపట్టామన్నారు. పలు గ్రామల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. ఖానాపూర్, పెంబి మండలాల్లో 2018 జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ పథకం కింద రూ. 8 కోట్ల 53 లక్షల 80 వేల 523 పనులను చేపట్టామన్నారు. ప్రజావేదికలో ఖానాపూర్, పెంబి మండలాల్లోని అన్ని గ్రామపంచాయితీల పరిధిలో జరిగిన ఉపాధి పనుల నివేదికలను డీఆర్‌సీలు, ఎస్‌ఆర్‌సీలు సమావేశంలో చదివి వినిపించారు. ఖానాపూర్ మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రూ. లక్షా 45 వేల, 372 అక్రమాలకు పాలడ్డట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడికాగా వారి నుంచి ఆ డబ్బులను రికవరీ చేశామని తెలిపారు. వివిధ గ్రామపంచాయితీల్లో పనిచేస్తున్న 8 మంది మేట్లు అక్రమాలకు పాల్పడ్డట్లు విచారణలో తేలడంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధి హామీ పథకం పేద కూలీల కోసం ప్రవేశపెట్టబడిందని, ఈ పథకంలో పనిచేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడితే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీవో బాలే మల్లేశ్, హెఆర్ మేనేజర్ సుధాకర్, ఎస్‌పీ తిరుపతి, ఏపీవో దాసరి ప్రమీల ఈసీ నితిన్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎఫ్‌ఏలు, సామాజిక తనిఖీ బృంద సభ్యులు పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...