బోనమెత్తిన జడ్పీ చైర్‌పర్సన్


Wed,October 17, 2018 02:40 AM

సోన్ : మండలంలోని కడ్తాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద జడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి మంగళవారం మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక హనుమాన్ ఆలయం నుంచి బోనం ఎత్తుకొని దుర్గామాత మండపం వద్దకు చేరుకొని అమ్మవారికి సమర్పించారు. రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు నైవేద్యం, ఒడిబియ్యం, సారె, గాజులు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలను సల్లంగ సూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నవరాత్రుల సందర్భంగా బుధవారం రామాలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజమణి పోశెట్టి, మాజీ ఉప సర్పంచ్ బొజ్జ భీమేశ్, ఎంపీటీసీ సభ్యులు బర్మ నర్సయ్య, బర్మ దాసు, గుర్రం గన్నన్న, రంజిత్‌గౌడ్, నడ్పి నర్సయ్య, వడ్ల గంగన్న, తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...