ఆశీర్వదించండి.. అందుబాటులో ఉంటా


Wed,October 17, 2018 02:40 AM

ఖానాపూర్ : కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీ విస్తున్న గీత కార్మికులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్య ల పరిష్కానికి ఎప్పటికప్పుడు చర్యలు తీ సుకుంటానని టీఆర్‌ఎస్ ఖానాపూర్ ఎమ్మె ల్యే అభ్యర్థి అజ్మీరా రేఖా నాయక్ అన్నా రు. విద్యానగర్‌లో గౌడ సంఘం నాయకు లు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గీతవృత్తిపై ఆధారపడి జీవించే కార్మికుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని సీఎం కేసీఆర్ చెట్ల పన్నును రద్దు చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి పథకాలు కార్మికులకు అ మలు కానున్నాయన్నారు. కులవృత్తుల ప రిరక్షణకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఆయన ఆడుగుజాడల్లోనే తాము నడుస్తున్నామన్నారు. గతంలో అధికారంలో ప్రభుత్వాలు కులవృత్తులను పూర్తిగా విస్మరించాయన్నారు. ఇప్పుడు కూటమి పేరుతో ప్రజలవద్దకు వస్తున్నారని, స్వార్థ రాజకీయాలు చేసేవారిని నమ్మవద్దని కోరారు. అనంతరం రేఖా నాయక్‌ను తెలంగాణ గౌడ సంఘం ఖానాపూర్ విభాగం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెళ్లి సునీత, సంఘం నాయకులు వొల్లాల చిన్న నర్సాగౌడ్, రాజేంధర్‌గౌడ్, రాజమొగిలి, రాజారాంగౌడ్, మూల శ్రీధర్‌గౌడ్, వెంకాగౌడ్, మురళీగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు అంకం రాజేందర్, వెంకటప్పయ్య, జన్నారపు శంకర్, గౌళీకార్‌రాజు, ఎంపీటీసీ కల్లెడ రాజవ్వ పాల్గొన్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...