కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు ధర


Wed,October 17, 2018 02:39 AM

లోకేశ్వరం : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తరఫున వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. రైతుల తరపున ఏమైనా సమస్యలుంటే అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. నిర్వాహకులు రైతుల వద్ద నాణ్యమైన ధాన్యాన్ని తీసుకోవాలన్నారు. సెంటర్ నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిణీ తర్వాత మాయిచ్చర్ రావడం లేదని ధాన్యం కొరత చేస్తే దానికి బాధ్యులు నిర్వాహకులు, అధికారులేనని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.1770 బి గ్రేడ్ రకానికి రూ.1750 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌వో కిరణ్‌కుమార్, డీఎం శ్రీకళ, పౌర సరఫరాల శాఖ డీటీలు రహీమొద్దీన్, రమేశ్, గ్రామస్తులు, ఐకేపీ మహిళలు, రైతులు ఉన్నారు.

కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్ టౌన్ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని జేసీ భాస్కర్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. జేసీ చాంబర్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కో-ఆర్డినేషన్‌తో సమావేశాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొత్తం 118 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందున అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రైతులకు ధాన్యాన్ని తేమ శాతం పరిశీలించుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే గోదాములకు తరలించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో కిరణ్‌కుమార్, డీఎంవో శశికళ, అధికారి సూర్యచందర్‌రావు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...