మహిళలే కీలకం..!


Tue,October 16, 2018 01:11 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జనవరి 1, 2018నాటికి 18ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 10 నుంచి 25వరకు కొత్తగా ఓటు నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఈ నెల 12న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 6,09,362మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో గతంలో 5,56,849మంది ఓటర్లు ఉండగా.. తాజాగా మరో 52,513 మంది ఓటర్లు పెరిగారు. ఇక జిల్లాలో 3,13,436మంది మహిళా ఓటర్లు, 2,95,855 మంది పురుష ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. మరో 71 మంది థర్డ్‌జెండర్లు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో 3,77,499మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో 1,09,104మంది మహిళా ఓటర్లు, 1,87,395మంది పురుష ఓటర్లు ఉన్నారు. రెండు జిల్లాల్లోని ఐదు నియోజక వర్గాల్లోనూ ఓటర్ల సంఖ్య పెరిగారు. నిర్మల్ జిల్లాలో 17,581మంది, ఆదిలాబాద్ జిల్లాలో 2529మంది పురుషుల కంటే మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు.

ఎన్నికల్లో ప్రభావం చూపనున్న మహిళా ఓటర్లు
ఖానాపూర్ నియోజకవర్గంలో 93554మంది మహిళా ఓటర్లు ఉండగా.. 91655మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 1899మంది అధికంగా ఉండగా.. నిర్మల్ నియోజకవర్గంలో 110900మంది మహిళా ఓటర్లు ఉండగా.. 99534మంది పురుష ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 11,366 మంది ఎక్కువగా ఉన్నారు. ముథోల్ నియోజకవర్గంలో 108982మంది మహి ళా ఓటర్లు ఉండగా.. 104666మంది మహిళా ఓటర్లు ఉ న్నారు. పురుష ఓటర్ల కంటే 4316 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో 98,645 మంది మహిళా ఓటర్లుండగా... 98,157 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లు 308 మంది అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 91,459 మంది మహిళా ఓటర్లు, 89,238 మంది పురుష ఓటర్లున్నారు. పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లు 2221 మంది అధికంగా ఉన్నారు. రెండు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే 20,110మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. సాధారణ ఎన్నికల్లో వీరి ఓటింగ్ శాతమే కీలకంగా మారనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాధారణ ఎన్నికల్లో వీరికి ఆశించిన మేర ప్రాతినిధ్యం, అవకాశాలు లభించడం లేదు.

మరోసారి ఇద్దరికి టీఆర్‌ఎస్‌లో అవకాశం
చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం, అవకాశం కల్పించడంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా విపక్షాలు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ మాత్రం మహిళలకు అవకాశాలు కల్పించటంలో పెద్దపీట వేస్తోంది. 2014సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించగా.. ఇద్దరు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో అజ్మీరా రేఖానాయక్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కోవ లక్ష్మికి అవకాశంరాగా.. ఇద్దరు ఎస్టీ మహిళలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు మహిళలకు తాజాగా 2018 ఎన్నికల్లోనూ మరోసారి టికెట్లు కేటాయించి టీఆర్‌ఎస్ పార్టీ అవకాశాన్ని కల్పించింది. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కోవ లక్ష్మి, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి అజ్మీరా రేఖానాయక్ టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగగా.. విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో దూసుకెళ్తున్నారు. విపక్ష పార్టీల్లో మాత్రం మహిళలకు ఆశించిన మేర అవకాశం లభించడం లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆసిఫాబాద్‌లో మర్సకోల సరస్వతికి, బీజేపీ నుంచి ముధోల్‌లో పడకంటి రమాదేవికి మాత్రమే అవకాశం లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మహిళా కూడా అవకాశం ఇవ్వలేదు. ఈసారి కూడా పలుచోట్ల నుంచి మహిళలు కాంగ్రెస్, బీజేపీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నప్పటికీ ఏ మేరకు అవకాశం లభిస్తుందో వేచి చూడాలి.

మహిళలకు పెద్దన్నగా కేసీఆర్ పథకాలు..
మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. గర్భిణులు ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేందుకు ప్రసవాతనంతం ఇంటికి చేరడం కోసం ప్రభుత్వం 102 ఏర్పాటు చేసింది. సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానల్లో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తోంది. పుట్టే పిల్లల కోసం రూ. 12 వేలు అందించడంతో పాటు, ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నారు. ప్రసవం తర్వాత రూ.2వేల విలువైన 16 రకాల వస్తువులుండే కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. దీంతో దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతుల వివాహానికి రూ.1,00,116 చొప్పున అందిస్తున్నారు. షీ టీంల ద్వారా ఎక్కడా మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూశారు. దీంతో పోకిరీలు, ఇతరుల నుంచి లైంగిక వేధింపులు, ఇబ్బందులు తప్పాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. మహిళలనే లబ్ధిదారులు పేర్కొంటూ పట్టాలు ఇచ్చారు. దళిత బస్తీలో భాగంగా భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పట్టాదారు పాసు పుస్తకాలు మహిళల పేరిట జారీ చేశారు. ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెద్ద ఎత్తున పెంచారు. ఇలా ఎన్నో రకాలుగా మహిళలకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. దీంతో మహిళలు టీఆర్‌ఎస్ పార్టీకి, అభ్యర్థులకు అండగా నిలువనున్నారు.


135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...