హిందువుల జాగరణ కోసమే హిందూవాహిని


Mon,October 15, 2018 02:00 AM

భైంసా/ నమస్తే తెలంగాణ : హిందూ శక్తి నిర్మాణం చేసేదే హిందూ వాహిని అని హరిద్వార్ జగన్నాథ్ ధాం శ్రీ హంస్‌దేవాచార్య స్వామిజీ అన్నారు. పట్టణంలోని కిసాన్‌గల్లిలోని శిశుమందిర్ పాఠశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన హిందూ శంఖారావం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మంలో గోమాతను పూజిస్తామని దానిని అవహేళనపరిస్తే చట్టబద్ధంగా శిక్షార్హులవుతారని చెప్పారు. హిందువులకోసం నిలబడే సంఘమే హిందూ వాహిని అని తెలిపారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్, వీరసావర్కార్ వంటి వారు ఎన్నో త్యాగాలు చేశారని వారి త్యాగాల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. అలాంటిదే ఇప్పుడు హిందూ వాహిని కార్యకర్తలు చేస్తున్నారన్నారు. దానికి తోడు హిందూ శక్తి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా హిందూ ధర్మ సంరక్షణ కోసం హిందూ వాహిని పనిచేస్తోందన్నారు. హిందువులంతా భరత మాత ముద్దుబిడ్డలని చెప్పారు. కార్యక్రమంలో దేవాలయాల సంరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారతీ స్వామిజీ, హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సరికొండ శ్రీనివాస్, అప్పాల రాజన్న, సూర్యవంశీ సంతోష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...