క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి


Sun,October 14, 2018 02:46 AM

ఆదిలాబాద్ టౌన్ : విద్యార్థులు చదువులో కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాణించినప్పుడే తమ లక్ష్యాన్ని ఛేదించగలరని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇం దిరా ప్రియదర్శిని స్టేడియంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నుంచి నిర్వహిస్తున్న 64వ రాష్ట్రస్థాయి కార్ఫ్‌బాల్ అండర్ - 14, 17, 19 క్రీడా పోటీల ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా, రాష్ట్ర పాఠశాల క్రీడా సమాఖ్య పతాకాలను ఆవిష్కరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మర్చ్‌ఫాస్ట్ నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనం అందజేశారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ నిర్వహించగా.. క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో రవీందర్‌రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ఒత్తిడి లేకుండా విజయాలు సాధించడానికి వ్యక్తి సంపూర్ణ వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. క్రీడలపై ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలని సూచించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయని చెప్పారు. జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని కోరారు. క్రీడలు మనిషి జీవితంలో ఒక భాగం కావాలని, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన క్రీడల అధికారి పోరెడ్డి పార్థశారథి, పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి జక్కుల శ్రీనివాస్, పీడీలు రామయ్య, పోటీల కన్వీనర్ హరిచరణ్, రాష్ట్రపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు దయానంద్‌రెడ్డి, మహేశ్, వెంకట్మ్రణ, ఎన్.స్వామి, కృష్ణ, సాయికుమార్, రాంకుమార్, జాదవ్ రవీందర్, రాథోడ్ గోపాల్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...