రేషన్ పక్కదారి పడితే కఠిన చర్యలు


Sun,October 14, 2018 02:46 AM

నిర్మల్‌టౌన్: జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు అందిస్తున్న సరుకులను పక్కదారి పట్టించినా, అక్రమంగా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సంబంధాల అధికారి కిరణ్‌కుమార్ హెచ్చ రించారు. పట్టణంలోని డీఎస్‌వో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రేషన్ షాపులకు సరఫరా అవుతున్న అన్ని రకాల రేషన్ సరుకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీలర్లు రేషన్ బియ్యాన్ని తప్పనిసరిగా లబ్ధిదారులకు అందించేందుకు ఇటీవలే సంస్కరణలు తీసుకువచ్చినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు జరగడంతో జిల్లా సరిహద్దులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను నియమించి అక్రమ రవాణాపై దృష్టిపెట్టామన్నారు. అక్రమంగా రేషన్ సరుకులు తరలిస్తున్నట్లు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో డీటీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...