విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి


Fri,October 12, 2018 11:31 PM

సీసీసీ నస్పూర్ : రైతుల కోసం వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా సరఫరా చేస్తున్న 24గంటల విద్యుత్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ఆదేశించారు. శుక్రవారం సీసీసీ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో ఆయన మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. విద్యుత్ రంగ సమస్యలు, అధికారు ల పనితీరు, రైతులకు 24 గంటల విద్యుత్, పెండింగ్ బకాయిలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కొత్తలైన్ల ఏర్పాటు, సబ్ స్టేషన్ల నిర్మాణం, బిల్లు వసూళ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాన్ని అధిగమించడానికి సమస్య ఉన్న చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకొన్న వెంటనే కనెక్షన్లు ఇవ్వాలన్నారు. బిల్లుల వసూళ్లులో పురోగతి సాధించాలన్నారు. ఈ సందర్భంగా సీఎండీ గోపాల్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ లో అంతరాయం లేకుండా చూస్తున్నామని, అక్కడక్కడ సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వినియోగదారుల కు నిరంతరాయంగా కరెంట్‌ను అందించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో సీజీఎం నగేశ్, ఆదిలాబాద్ ఎస్‌ఈ చౌహాన్, నిర్మల్ ఎస్‌ఈ జాడి ఉత్తమ్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్‌ఈ రమేశ్‌బాబు, విజిలెన్స్ సీఐ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాలోని ఈఈలు, డీఈలు, ఏడీలు, ఏవోలు, ఏఏవోలు, ఏఈలు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...