పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు


Thu,October 11, 2018 11:50 PM

నిర్మల్‌టౌన్ : జిల్లా లో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందు కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని మార్కెటింగ్ శాఖ ఆదిలాబా ద్ జిల్లా ప్రత్యేకాధికారి బి. రవికుమార్ అన్నా రు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమి టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లను ఈ నెల 15 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం మొత్తం 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్మల్‌లో -5, ఆదిలాబాద్‌లో -9, మంచిర్యాల్‌లో -4, ఆసిఫాబాద్‌లో -4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించిందన్నారు. గత ఏడాదితో పోల్చితే రూ.1130 ధర పెంచిందన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు లక్షల 69 వేల హెక్టార్లో పత్తి సాగు చేస్తుండగా, మార్కెట్‌కు 15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వస్తుందని అంచాన వేస్తున్నారు. జిల్లాలో పత్తి పండించిన రైతులకు రెండు లక్షల 69 వేల మందికి గుర్తింపు కార్డులను అందిస్తామని చెప్పారు. ఈ కార్డు ఆధారంగా సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు చేపడుతామన్నారు. పత్తి విక్రయించిన రైతులకు మూడు రోజుల్లోనే ఆన్‌లైన్ పేమెంట్ చెల్లిస్తామని తెలిపారు. రైతుల డిమాండ్‌ను బట్టి అవసరమైతే మరికొన్ని కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పత్తి రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలన్నారు. రైతులకు మార్కెట్‌లో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించి సహకరించాలన్నారు. పత్తి కొనుగోళ్లల్లో అక్రమాలకు తావు లేదన్నారు. రైతులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...