అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు


Thu,October 11, 2018 11:49 PM

బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా బాసరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మన రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర ప్రాం తాల్లో నుంచి భక్తులు వచ్చారు. ముందుగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలైన్‌లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాస మండపంలో పండితులతో అక్షర శ్రీకార పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిచ్చారు. భైంసా డీఎస్పీ రాజేశ్ భల్లా ఆధ్వర్యంలో ముథోల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్ దగ్గరుండి బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో మూ డో రోజు శుక్రవారం అమ్మవారు కుష్మాండ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

భక్తులకు ఇబ్బందులు కలుగనివ్వం..
బాసర : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాస ర సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలయంలో తనిఖీలు చేపట్టారు. తాత్కలిక మూత్రశాలలు, అదనపు ప్రసాద కౌంటర్లు, క్యూలైన్ల ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నా రు. ఇప్పటికే ప్రత్యేక క్యూలైన్లు, అదనపు ప్రసాద కౌం టర్లు, తాత్కాలిక మూత్రశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆలయ అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకు డు సాయిలు, సిబ్బంది ఉన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...